హక్కుల సాధనకు సిద్ధం కావాలి
కరీంనగర్: హక్కుల సాధన కోసం బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కృషి భవన్‌లో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యావంతుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. దేశ జనాభాలో 50శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. జీవో 29 తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ఆధిపత్య కుల నాయకుల జెండాలు మోసిన బీసీలు ఇప్పుడు ప్రశ్నించేస్థాయికి వచ్చారని అన్నారు. ఈ సమావేశంలో గంట రాముల యాదవ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, ఈసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల విజయ్‌కుమార్, మర్రి శ్రీనివాస్ యాదవ్, కోట రాములు యాదవ్, లతా పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment