నీటి కుంటలో గాలింపు, (ఇన్‌సెట్లో) బాలుని చిన్నాన్న సతీశ్
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం సమీపం తెప్పేనహళ్లి గ్రామం నీటి కుంటలో పడి 12 సంవత్సరాల అభిషేక్ అనే బాలుడు గల్లంతయ్యాడు. బుధవారం బాదగానహళ్లి గ్రామంలో రైతు మునీంద్ర కుమారుడైన అభిషేక్, స్నేహితుడు శ్రీనివాస్ కలిపి తిప్పేనహళ్లి కుంటకు కలిసి చిన్నాన్న సతీశ్‌తో కలిసి వెళ్లారు. చిన్నాన్న ఆవును కడుగుతూ కోపంతో అభిషేక్‌ను కాలితో కొట్టాడని, దీంతో నీటిలో పడిపోయాడని తల్లిదండ్రులు విలపించారు. జతలో ఉన్న శ్రీనివాస్‌ను ఎవరికీ చెప్పవద్దని సతీశ్ బెదిరించాడని తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు..
కొడుకు బుధవారం రాత్రంతా ఇంటికి రాకపోవడంతో గురువారం పొద్దున్నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, బంధుమిత్రులు నీటి కుంటలో గాలించగా బాలుని మృతదేహం బయటపడింది. బంధువులు అందరు వచ్చి సతీశ్‌ను బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు. చిక్క రూరల్ పోలీసులు సతీశ్‌ను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. సతీశ్ మాత్రం నేనేమి చేయలేదని, అతనే నీటిలో ఈత కొడుతూ మునిగాడని చెబుతున్నాడు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగించింది.
చిన్నాన్నే తోసేశాడన్న తల్లిదండ్రులు
మృతదేహం వెలికితీసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment