మాట్లాడుతున్న ఎంఆర్‌పీఎస్ నాయకులు
శివాజీనగర: బెంగళూరులో ఉన్న నాలుగు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేశాయని మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఆరోపించారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం సమితి రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు ఎం.సీ.శ్రీనివాస్ మాట్లాడుతూ పులికేశీనగర, సీ.వీ.రామన్ నగర, మహాదేవపుర, ఆనేకల్ ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గానికి కనీసం రెండు స్థానాలైనా కేటాయించాలని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ను కోరుతున్నామన్నారు. తమ విన్నపాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దాస్, డేవిడ్ రంగన్న, సత్యనారాయణ, బాలన్న, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment