కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అతిథులు
గంగావతి: ఇంటి పైకప్పు అర్త్ కావడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కారటగి తాలూకాలోని సిద్దాపుర గ్రామంలో బుధవారం జరిగింది. జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు బజార్ బసవరాజప్ప రెండో కుమారుడు ఆదిత్య(19) నూతనంగా నిర్మించిన ఇంటిపైకి ఉదయాన్నే ఎక్కడంతో పైకప్పునకు విద్యుత్ అర్త్ అయి అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కోలారు: 11 కెవి విద్యుత్ తీగ తగిలి షాక్‌తో ఓ వ్యక్తి మరణించిన ఘటన జిల్లాలోని వక్కలేరి ఫిర్కా నేర్నహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బైచప్ప(65) సాయంత్రం గొర్రెలు మేపడానికి వెళ్లినపుడు కిందపడి ఉన్న విద్యుత్ తీగ కాలికి తగిలి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. బైచప్ప ఒక్కలిగ సముదాయ నాయకుడిగా, బీజేపీ క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. కాగా ఘటనకు సంబంధించి బెస్కాం విభాగం వక్కలేరి శాఖ జేఈ కె ఎం శ్రీనివాస్, లైన్‌మెన్ మంజునాథ్‌లను సస్పెండ్ చేశారు.
పోటీ పరీక్షలపై శ్రద్ధ పెట్టాలి
కోలారు: పోటీ పరీక్షలపై ఎక్కువ దృష్టి పెట్టాలని దావణగెరె వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ బిడి కుంబార తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లా కుంబార విద్యార్థి నిలయంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో టెన్త్, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన సముదాయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం పలువురు కురుబ సముదాయ సాధకులను సన్మానించారు. మైసూరు జెడ్పీ సీఈఓ కేఎం గాయత్రి, సీనియర్ సాహితీవేత్త బీకే చెన్నబసప్ప, డాక్టర్ నాగభూషణ, తబలా నారాయణప్ప పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడండి
కేజీఎఫ్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పదాధికారులు పోరాటం చేయాలని నవ కరవే రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రాజగోపాలగౌడ తెలిపారు. బుధవారం నవ కరవే కార్యాలయంలో నిర్వహించిన నూతన పదాధికారుల ఎంపిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యక్షుడు నాగరాజ్, తాలూకా అధ్యక్షుడు రామసాగర కిరణ్, సందీప్, భూపాల నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment