మాలూరు: పట్టణానికి చెందిన శాంతి ఆల్మడా అనే యువతి పదేళ్లుగా ఇజ్రాయెల్ దేశంలోని రాబ్స నగరంలో నర్సుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటోంది. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంకర్లలో తలదాచుకుంటున్నట్లు శాంతి అల్మడా భర్తకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
ఆమె భర్త గ్రీశెన్ ఆల్మడా మాలూరులో ప్రైవేటు ఛానెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఎలాంటి భయం లేదని సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు ఆమె తెలిపింది. తాము ఉన్న చోట ఎలాంటి యుద్ధ వాతావరణం లేదని, భారత రాయబార కార్యాలయం తమను సంప్రదిస్తున్నట్లు శాంతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment