దుష్పరిణామాలు ఇవీ
బనశంకరి: సిలికాన్ సిటీలో గాలిలో ప్రమాదకర స్థాయిలో నైట్రోజన్ డై ఆకై ్సడ్ ఆవరించింది. పీల్చే గాలిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. ఈ వాయు కాలుష్యం శ్వాసకోశ జబ్బులకు కారణమౌతోందని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ ఇటీవల నివేదికలో బహిర్గతం చేసింది. గ్రీన్ పీస్ ఇటీవల బెంగళూరు నగరంలో వివిధ ప్రాంతాలలో వాయు నాణ్యత గురించి అధ్యయనం చేసి నివేదిక ను వెల్లడించింది. బెంగళూరులో చాలా ప్రమాదకరమైన నైట్రోజన్ డైఆకై ్సడ్ మోతాదు హెచ్చుమీరిందని నివేదికలో ప్రస్తావించారు. ఇది వాహనాల పొగ, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలలో ఉంటుంది.
రైల్వే స్టేషన్ వద్ద డేంజర్
బెంగళూరులో 13 యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కేంద్రాల్లో గాలి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. సిటీ రైల్వేస్టేషన్ వద్ద గాలిలో అత్యధికంగా నైట్రోజన్ డై ఆకై ్సడ్ (ఎన్‌ఓ2) ఉన్నట్లు వెలుగుచూసింది. ఇలా ఏడాదిలో 80 శాతం కంటే ఎక్కువ రోజులు కొనసాగింది, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను మితిమీరిపోయింది. అంతేగాక బీటీఎం లేఔట్, సిల్క్ బోర్డులో గాలి నాణ్యత నాసిరకమని నిర్ధారణ అయ్యింది. దేశంలో పరమ చెత్త గాలి నాణ్యత ఉన్న 7 నగరాలలో బెంగళూరు ఒకటని వెల్లడైంది.
రవాణా వ్యవస్థ మారాలి
ఏ రకంగా చూసినా వాయు కాలుష్యం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది. దీనికి కొత్త తరహా పరిష్కారం కనుక్కోవలసిన ఆశవ్యకత ఉందని, రవాణా వ్యవస్థలోనే సంస్కరణలు రావాలని గ్రీస్ పీస్ ఇండియా మోబిలిటి క్యాంపైనర్ అకిజ్ ఫారూక్ తెలిపారు.
బెంగళూరులో వాహనాల రద్దీ, కాలుష్యం గోల
బెంగళూరులో అధిక మోతాదులో
నైట్రోజన్ డై ఆక్సైడ్
వాహనాలు, కర్మాగారాల నుంచి
విడుదల
తీవ్ర అనారోగ్యాలకు మూలం
గ్రీన్ పీస్ నివేదిక హెచ్చరిక
బెంగళూరు నగరంలో కోటిన్నరకు పైగా ఉన్న కార్లు, బస్సులు, బైక్‌లు వంటి వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కలుషిత వాయువులు మానవ ఆరోగ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయి. ఆ ఉద్గారాలలోని ప్రమాదకర రసాయనాలు పెనుభూతంగా తయారయ్యాయి. పేరుకే ఉద్యాన నగరి, ఎక్కడి చూసినా పచ్చదనం, పార్కులతో అలరారుతూ ఉంటుది. కానీ స్వచ్ఛమైన గాలి ఏదంటే దిక్కులు చూడాలి.
నైట్రోజన్ డై ఆకై ్సడ్ కలిసిన గాలిని పీల్చడం వల్ల అనారోగ్యం తలెత్తుతుంది.
వైజ్ఞానిక అధ్యయనాలు తెలిపిన ప్రకారం నిరంతరం నైట్రోజన్ డై ఆకై ్సడ్ శరీరంలో చేరితే అస్తమా, శ్వాసకోశాలు దెబ్బతినడం వంటివి ఎదురవుతాయి.
అప్పటికే శ్వాస కోశ జబ్బులు ఉంటే మరింత విషమించే ముప్పు ఉంది. అలర్జీ, సైనసైటిస్ తదితరాలు తీవ్రమవుతాయి.
సుదీర్ఘకాలం పాటు ఈ కలుషిత గాలిని పీల్చితే గుండె జబ్బులు, శ్వాసకోశ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అని తేలింది.
2019 నివేదిక ప్రకారం బెంగళూరులో 2,730 మంది పిల్లల్లో కనబడిన అస్తమాకు వాతావరణంలో నైట్రోజన్ డై ఆకై ్సడ్ మూలమని రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment