యువతిపై అన్నదమ్ముల దాష్టీకం
విదేశాలకు పరారు
దొడ్డబళ్లాపురం: యువతికి సహాయం చేసి, ఆ సాకుతో పరిచయం పెంచుకున్న దుండగుడు ఆమైపె అత్యాచారానికి పాల్పడి, వీడియోలు తీసి బెదిరించాడు. ఈ సంఘటన మంగళూరులో చోటుచేసుకుంది. మంగళూరు కద్రి పోలీస్‌స్టేషన్‌లో ఈమేరకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.
కారు రిపేరి వచ్చిందని..
గత జూలై 21న బాధిత యువతి కారు కద్రి వద్ద సమస్య వచ్చి నిలిచిపోయింది. అటుగా బైక్‌పై వచ్చిన మొహమ్మద్ షఫీన్ అనే వ్యక్తి కారు రిపేరీ చేసిచ్చి, యువతిని కొడియాలాబైలులో ఉన్న అపార్ట్‌మెంట్‌లో డ్రాప్ చేశాడు. ఆమె నుంచి మొబైల్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు1న యువతి ఇంటికి వెళ్లి పండ్లరసంలో మత్తుమందు కలిపి తాగించి అత్యాచారం చేశాడు. వీడియో కూడా తీసుకున్నాడు.
తరువాత ఆమెను బెదిరించి పలుసార్లు లైంగిక దాడి చేయడంతోపాటు ఆమె కారును తీసుకెళ్లాడు. ఆగస్టు 25న యువతి తన కారు కోసం షఫీన్ ఇంటికి వెళ్లగా అక్కడ అతడి అన్న మహమ్మద్ శియాబ్ కూడా అత్యాచారయత్నం చేశాడు. ఆమె ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఆగస్టు 27 రాత్రి యువతి ఇంటికి వచ్చిన శియాబ్ ఆమె పర్సులో ఉన్న రూ.62వేలు నగదు తీసుకుని వెళ్లిపోయాడు. తరువాత నిందితులైన అన్నదమ్ములు విదేశానికి పారిపోయారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
లైంగికదాడి చేసి.. వీడియోలు తీసి..
దొడ్డబళ్లాపురం: మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, వీడియోలు తీసి బెదిరించి తరచూ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ యువతి హైగ్రౌండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అక్కి లక్ష్మిరెడ్డి అనే యువకుడు నిందితుడు. వివరాలు.. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న బాధిత యువతి, 2019లో ఆర్‌టీ నగరలోని ప్రైవేటు బ్యాంకులో క్రెడిట్ కార్డ్ విభాగంలో పనిచేస్తుండేది.
ఆ సమయంలో క్రెడిట్ కార్డు తీసుకోవడానికి వచ్చిన లక్ష్మిరెడ్డి పరిచయం చేసుకుని దగ్గరయ్యడు. బర్త్‌డే ఉందని యువతిని ఇంటికి పిలిపించి టీలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక అత్యాచారం చేశాడు. ఆ సమయంలో వీడియోలు తీసుకున్నాడు. తరువాత చాలాసార్లు వీడియోలు చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని, కులం పేరుతో దుర్భాషలాడాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని ఇంటికి వెళ్లగా జాడ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment