బనశంకరి: అనైతిక బంధాలు చివరికి విషాదంగానే పరిణమిస్తాయనేందుకు ఇదో ఉదాహరణ. మరిదితో సరసాలు రట్టు రావడంతో వదిన ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన బెళగావి జిల్లా రాయబాగ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
ఫోటోను వాట్సాప్ స్టేటస్‌లో
వివరాలు.. కాగవాడ తాలూకా కుసనాళ గ్రామానికి చెందిన మహిళ ఆరతికి 7 ఏళ్లు క్రితం మోరబ గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే ఆరతికి.. భర్త తమ్ముడు మృదున్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అతడు మొబైల్‌లో ఫోటోలు తీసుకునేవాడు. మృదున్ వదినతో ఉన్న ఫోటోలను వాట్సాప్ స్టేటస్‌లోను, అలాగే ఇన్‌స్టాలోనూ పెట్టుకున్నాడు.
ఇది గమనించిన గ్రామంలోని యువకులు ప్రశాంత్‌కు విషయం చెప్పారు. భర్త కోపంగా ఇంటికి వెళ్లి భార్యను నిలదీయడంతో పెద్ద గొడవైంది, గ్రామస్తులు ఇరువురికీ సర్దిచెప్పారు. మళ్లీ గొడవలు జరగకుండా మహిళను ఆమె సోదరి ఇంటికి పంపించారు. తమ గురించి ఊరంతా రట్టు కావడంతో ఆరతి భరించలేకపోయింది, ఆదివారం సోదరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాయబాగ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment