దత్త నామమే అభయం
మైసూరు: కేవలం స్మరణం చేయడం ద్వారా దత్తాత్రేయ స్వామి సంతుష్టులు అవుతారని, ప్రపంచంలో ఉన్న ఎలాంటి కష్టం వచ్చినా నివారణకు దత్తాత్రేయ స్వామి స్మరణ చేయాలని దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. మైసూరులో దత్తపీఠం ఆశ్రమంలో ఆదివారం ఉదయం దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకం నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ నేడు ప్రపంచం మొత్తం యుద్ధ భయం కనిపిస్తోందన్నారు. అంతటా ప్రజలకు ప్రశాంతత కరువైందని చెప్పారు. అందువల్ల ప్రపంచాన్ని రక్షించేది శ్రీదత్తాత్రేయ స్వామి అని, ఆయనను పూజిస్తే శాంతిని, నెమ్మదిని ప్రసాదిస్తారని పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment