సమాజ సేవకు అధికారం ముఖ్యం కాదు
రాయచూరు రూరల్: సమాజ సేవకు అధికారం ముఖ్యం కాదని మాజీ మంత్రి శివన గౌడ నాయక్ నిరూపిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర అన్నారు. మాన్విలోని రాయచూరు రహదారిలో ప్రైవేటు పాఠశాల మైదానంలో కేఎస్‌యస్ సాంఘిక సేవా సమితి సమన్వయ్య సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల్లో ఆయన పాల్గొన్నారు. మాంగళ్య ధారణతో ఏకమైన 120 జంటలను ఆయన ఆశీర్వదించి మాట్లాడారు. పేద కుటుంబాలకు భారంగా మారినందున శివన గౌడ నాయక్ దశాబ్దాలుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. ఆయన చేస్తున్న సమాజ సేవలు ఆదర్శనీయమన్నారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కోసం కేంద్ర నాయకులతో చర్చిస్తామన్నారు. శివనగౌడ నాయక్ మాట్లాడుతూ విజయేంద్ర కేంద్రంతో మాట్లాడి ఎయిమ్స్ మంజూరుకు కృషి చేయాలన్నారు. సభలో శాసనసభ్యులు గాలి జనార్దన రెడ్డి, భైరతి బసవరాజ్, శివరాజ్ పాటిల్, మాజీ శాసన సభ్యులు తిప్పరాజ్, గంగాధర నాయక్, హన్మంతప్ప అల్కోడ్, మాజీ ఎంపీ బి.వి.నా యక్, స్వామీజీలు శరణప్పగౌడ, సాంఘిక సేవా సమితి సమన్వయ్య సంస్థ అధ్యక్షుడు తిమ్మారెడ్డి గౌడ రాఘ వేంద్ర, రమానంద పాల్గొన్నారు.
సామూహిక వివాహ
మహోత్సవాల్లో విజయేంద్ర
Comments
Please login to add a commentAdd a comment