పాఠ్యాంశాలు బోధించేలా చర్యలు చేపట్టాలి
ఖమ్మంమామిళ్లగూడెం: కేజీబీవీల్లో పాఠ్యాంశాల బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అర్బన్ కేజీబీవీ ఎదుల నిరసన చేపట్టగా ఆజాద్ మాట్లాడారు. కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో పాఠాలు నడవకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇంకా మూడు నెలల్లో పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు ఉన్నాయని, విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల్ని విద్యాలయాల్లోకి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యశ్వంత్, స్టాలిన్, కార్తీక, దీపిక, నవీన, సంధ్య, స్వరూప, అనూష, దీప్తి, అనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment