బాలికల క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : ఉమ్మడి జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్ –17 బాలికల క్రికెట్ జట్టును ఆదివారం ఎంపిక చేశారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు సభ్యులు పాల్గొంటారని పాఠశాలల క్రీడా సంఘం కార్యదర్శి కె.నర్సింహమూర్తి, వి.నరేష్ తెలిపారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 42 మంది హాజరయ్యారని, వీరిలో 20 మందిని క్యాంపునకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. కోచింగ్ క్యాంప్ అనంతరం తుది జట్టును ప్రకటిస్తామన్నారు. కోచింగ్ క్యాంప్‌నకు ఎంపికై న వారిలో వైష్ణవి, అనన్య, ఝాన్సీ, యశస్విని, యమున, నేహ, సాయి దీక్షిత, హిమవర్షిని, మాన్వి, గ్రీష్మ, వెన్నెల, శ్రీజ, రేవతి, శ్రీ హర్షిత, యశస్వి, మనస్వి, మేఘన, నిఖిత హెలెన్, గౌరీ మంజలి, తాజ్ అత్‌షా ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్, సంపత్, సైదేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment