ప్ర‘యోగం’ ఉన్నట్లే..
● ల్యాబ్ నిర్వహణకు నిధులు ● పూర్తిస్థాయిలో ప్రాక్టికల్స్ చేయనున్న ఇంటర్ విద్యార్థులు ● కళాశాలకు రూ.25 వేలు విడుదల
ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ల్యాబ్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సైన్స్ గ్రూపులకు సంబంధించి ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ల్యాబ్‌ల్లో పరికరాలను ఏర్పాటు చేసేందుకు కళాశాలకు రూ. 25 వేల చొప్పున నిధులు విడుదల చేసింది. జిల్లా లోని మొత్తం 21 జూనియర్ కళాశాలలకు నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో కళాశాలలకు కావాల్సిన పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.
అంతంత మాత్రంగానే..
ఇంటర్మీడియట్‌లో కెమిస్ట్రి, ఫిజిక్స్, బయాలజీ వంటి సబ్జెక్టులు చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయడం ప్రధానం. అయితే ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయోగాలు చేయడం విద్యార్థులకు కష్టంగా మారుతోంది. గత 8, 9 ఏళ్లుగా ల్యాబ్ పరికరాలను ప్రభుత్వాలు అందజేయలేదు. దీంతో పాడైన వాటిని, స్థానికంగా ఇతరుల సాయంతో తెచ్చుకుని ప్రయోగాలను మమ అనిపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు కూడా ఈ ప్రయోగాలపై ఆసక్తి చూపించలేకపోతున్నారు. ల్యా బ్‌లు పురాతన కాలం నాటివి కావడంతో ప్రయోగాలు చేసేందుకు లిక్విడ్ కూడా దొరకడం లేదు. దీంతో స్థానికంగానే కొనుగోలు చేసుకుంటున్నారు.
రూ.25 వేలు చొప్పున..
కళాశాలల్లో అభ్యసిస్తున్న సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ల్యాబ్‌ల్లో పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు కళాశాలకు రూ.25 వేల చొప్పున నిధు లను విడుదల చేసింది. జిల్లాలో గతంలో 19 కళాశాలలు ఉండగా.. గత ఏడాది కందుకూరులో ఒక కాలేజీ ప్రారంభమైంది. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో కొత్త కాలేజీ వచ్చింది. కొత్తగా ఏర్పాటైన రెండు కాలేజీల్లో ల్యాబ్‌కు సంబంధించిన పరికరాలు, లిక్విడ్ అందుబాటులో లేవు. ఇక్కడ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగిలిన కళాశాలల్లో పాడైపోయిన పరికరాలు, అత్యవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ తప్పనిసరి. ప్రాక్టికల్స్‌తోపాటు పరీక్షల నిర్వహణ కోసం పరికరాలు, లిక్విడ్ వంటివి కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ రూ.25 వేల నిధులతో అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థులను పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– కె.రవిబాబు,
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment