వెంకటస్వామికి ఘన నివాళులు
ఖమ్మంసహకారనగర్: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కారుమంచి శ్రీనివాసరావు, సిబ్బంది వెంకన్న, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ నవీన్ పాల్గొన్నారు.
గిరిజన ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
ఖమ్మం అర్బన్ : తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీని ఆదివారం నగరంలోని బంజారాభవన్‌లో ఎన్నుకున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల గిరిజన ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గంగావత్ శ్రీనివాస్ నాయక్ హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడిగా బాధావత్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శిగా జాటోత్ వీరన్న నాయక్, గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ హరికిషన్‌తో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భీంజీరావు, డాక్టర్ హరికిషన్, సేట్‌రామ్, నాగేశ్వరరావు, రమేష్ ,శ్రీను మోహన్, వీరు, వీరన్న, క్రాంతికుమార్, సురేష్, తులసీరామ్ పాల్గొన్నారు.
అడిషనల్ డీసీపీ విచారణ
తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో వృద్ధురాలిపై దాడికి పాల్పడి చోరీ చేసిన ఘటనపై ఆదివారం అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాద్‌రావు విచారణ చేశారు. వృద్ధురాలు ఆరెంపుల వెంకటమ్మ నివాసం ఉంటున్న ఇంట్లోకి వెళ్లి దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి చుట్టు పక్కలవారితో మాట్లాడారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్ పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్
పోలీసుల తనిఖీలు
ఖమ్మంక్రైం: టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రవి ఆధ్వర్యంలో సిబ్బంది నగరంలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న, సేవిస్తున్న అడ్డాలను తనిఖీ చేశారు. నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థులను విక్రయించడం, సరఫరా చేయడం లాంటి చర్య లకు పాల్పడితే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. నగరంలోని రోటరీనగర్, యస్‌బీఐటీ కళాశాల పరిసరాలు, మమత వైద్య కళాశాల పరిసరాలు, శాంతినగర్ పాఠశాల పరిసరాలు, చర్చికాంపౌండ్, జహీరపుర, ప్రకాష్‌నగర్, ఎన్టీఆర్‌సర్కిల్, కొత్తబస్టాండ్, గట్టయ్యసెంటర్, సరిత క్లినిక్, సారథినగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం
చింతకాని: మండలంలోని వందనం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి దానిలో ఉన్న కాపర్ వైరును అపహరించినట్లు ఏఈ చావా శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగుల్‌మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
కేసు నమోదు
ఖమ్మంక్రైం: పోలీసుల పేర్లతో బెదిరించిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ లారీడ్రైవర్‌పై దాడి చేసిన వారిని అదుపులో తీసుకున్నారు. మాధవరావు హర్ష, నాగరాజుపై కేసు నమోదు చేశారు. అన్ని అనుమతులతో ఇసుక తీసుకొచ్చి.. అన్లోడ్ చేసిన తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలో లారీని ఆపి బెదిరించారు. వారిపై కేసు నమోదు చేశామని సీఐ బాలకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment