ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు ఆటోబోల్తా పడి ఆరుగురు గాయపడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెరువుమాధారం గ్రామానికి చెందిన ఆటోలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆదివారం రాత్రి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. అజయ్‌తండా శివారుకు రాగానే.. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న లక్ష్మిబాయి (70), ఉషా (38), పద్మ (55), ఈశ్వరమ్మ (45), సుమతి (30)తో పాటు సురేఖ (11)కు గాయాలయ్యాయి. కాగా, లక్ష్మిబాయి, ఉషాకు తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం తరలించారు.
రెండు ఇళ్లలో చోరీకి యత్నం
ఖమ్మంక్రైం: నగరంలోని రెండు ఇళ్లలో చోరీకి యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మామిళ్లగూడెం, గాయత్రిభవన్ ప్రాంతంలో నివాస గృహాల్లో దొంగలు చోరీలకు ప్రయత్నించినట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో రెండు నివాసాల్లో కూడా ఎలాంటి ఆస్తి చోరీ గురి కాలేదని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మండలపరిధిలోని సీతారాంపురం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో టీఎస్‌ఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న బానోత్ నెహ్రూ తన ద్విచక్ర వాహనంపై పాల్వంచకు వెళ్తున్నాడు. ఈక్రమంలోనే మండలపరిధిలోని చలమన్ననగర్‌కు చెందిన ఓర్సు అంజి(30) బైక్‌పై పాల్వంచ నుంచి ఇంటికి వస్తున్నాడు. దీంతో సీతారాంపురం శివారులోని రాగానే అంజి లారీని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న నెహ్రూ బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో అంజి ఘటనా స్థలంలోనే ప్రాణాలో కోల్పోగా.. నెహ్రూకి తీవ్రగాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
దుమ్ముగూడెం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో కాలు విరిగింది. ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను స్థానికులు ఇలా తెలిపారు. మండల పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన కనుకు వెంకటరామయ్య శనివారం సాయంత్రం భద్రాచలం నుంచి వచ్చిన ఆటో దిగి రోడ్డు దాటుతున్నాడు. ఈక్రమంలో చర్ల వైపు నుంచి ట్రిపుల్ రైడింగ్‌తో ఓ ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వెంకటరామయ్య కాలు విరగగా స్థానికులు 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకులు చర్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment