ఖమ్మంక్రైం: ఓ యువకుడు, యువతి కలిసి జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారు. తమ ఫేస్‌బుక్ ఖాతాకు సంబంధించి పేరు మార్చుకొని వల విసరటం ప్రారంభించారు. యువతి ఓ యువకుడి వద్ద భారీగా డబ్బును చోరీచేసింది. సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ కథనం ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా నాయుడుతోట గ్రామానికి చెందిన వంకర లావణ్య, భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైరేసారం గ్రామానికి చెందిన సరిపల్లి శ్రీకాంత్ ఇద్దరు మిత్రులు. వారు జల్సాలకు అలవాటు పడి సైబర్ నేరాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రింకులావణ్య అనే పేరుతో లావణ్య ఫేస్‌బుక్ ఖాతా ఓపెన్ చేసి పురుషులకు ఫ్రెండ్ రెక్వెస్ట్‌లు పెట్టేది. సత్తుపల్లికి చెందిన ఓ యువకుడుడు రెక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. దీంతో ఇద్దరు కోన్ని రోజులు చాటింగ్ చేసుకున్నారు. తర్వాత లావణ్య అతడి వాట్సాప్ నంబర్ తీసుకొని రోజూ మాట్లాడేది. అప్పుడప్పుడూ నగదు తీసుకునేది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని నగదు కావాలని అడుగగా భారీగా డబ్బు పంపించాడు. కొంతకాలం తర్వాత డబ్బు ఇవ్వమని అడుగగా శ్రీకాంత్‌తో బాధితుడికి ఫోన్ చేయించి బెదిరించింది. అతడు.. తన చెల్లికి ఫోన్ చేసి బెదిరిస్తున్నావని, చాటింగ్, మిగతా ఆధారాలున్నాయని, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి విడతల వారిగా మొత్తం రూ.16,05,000 లాగారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ తెలిపారు. నిందితులను వైజాక్‌లో పట్టుకుని ఖమ్మంలో రిమాండ్ చేశామని, కేసు ఛేదించిన ఎస్‌ఐ రంజిత్, సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీనివాసరావును ఈ సందర్భంగా అభినందించారు.
రూ.16 లక్షలు చోరీ
Comments
Please login to add a commentAdd a comment