ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మాణం ?
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపట్టారనే ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ ఆర్‌ఐ వహీద్ బుధవారం పనులను అడ్డుకున్నారు. గతంలో డీఎస్పీ కార్యాలయ నిర్మాణానికి ఈ స్థలాన్ని కేటాయించిన అత్యంత విలువైన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పనులు చేపట్టడం వివాదాస్పదమైంది. ఖమ్మం సరిత క్లినిక్ సెంటర్‌లో బుర్హాపురం సర్వే నంబర్ 105లోకి వచ్చే 400 గజాల స్థలాన్ని గతంలో డీఎస్పీ కార్యాలయ నిర్మాణానికి కొన్నేళ్ల క్రితం కేటాయించారు. ఆతర్వాత నిర్మాణం జరగకపోగా, స్థలం తమదేనని కొందరు కోర్టును ఆశ్రయించినా కేసు కొట్టేసినట్లు తెలిసింది. అప్పటినుంచి ఖాళీగా ఉండడంతో సంక్రాంతి సెలవుల నేపథ్యాన ఓ నాయకుడు సిమెంట్ ప్రహరీ నిర్మించాడు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో ఆర్‌ఐ వహీద్ అక్కడకు వెళ్లి వివరాలు ఆరా తీయగా సదరు నాయకుడు సాయంత్రం తహసీల్‌కు వెళ్లి పత్రాలు సమర్పించాడు. వీటి ఆధారంగా నిర్మాణం స్థలం సర్వే నంబర్ 114లో, ప్రభుత్వ భూమి సర్వేనంబర్ 105లో తేల్చిన ట్లు సమాచారం. అయితే, పూర్తిస్థాయిలో నిర్ధారించే వరకు నిర్మాణ పనులు చేపట్టొద్దని ఆర్‌ఐ సూచించగా, కేఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి సతీష్ సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్వగ్రామంలో
మంత్రి తుమ్మల
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సంక్రాంతి సందర్భంగా మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో గడిపారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తన నివాసానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పండుగ శుభా కాంక్షలు తెలిపారు. ఆతర్వాత గ్రామంలో కలియతిరుగుతూ బంధువులు, మిత్రుల ఇళ్లకు వెళ్లి పలకరించారు. మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్, తుమ్మల శేషుబాబు, కొయ్యల అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వం..
రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుకను బుధవారం నేత్రపర్వంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా గావించారు. భక్తులు భారీగా హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment