అడ్డగోలు దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు దోపిడీ!

Published Thu, Jan 2 2025 12:24 AM | Last Updated on Thu, Jan 2 2025 12:24 AM

అడ్డగ

అడ్డగోలు దోపిడీ!

దళారుల దగా

జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నిత్యం ఎక్కడో ఓ చోట వారసంత నిర్వహిస్తున్నారు. దీంతో దళారులు అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామాల్లోని రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.6,400 మాత్రమే చెల్లించి అడ్డగోలుగా పత్తి కొనుగోలు చేస్తున్నారు. దళారుల దందాకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు పంటను మార్కెట్‌లో విక్రయించేందుకు వెళ్లిన పలువురు రైతులకు తూకంలో మోసాలు, తేమ, నాణ్యత పేరిట అధికారులు కొర్రీలు పెడుతుండటంతో వారు అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో గిట్టుబాటు కాకపోయినా పంటను విక్రయించాల్సిన దుస్థితి నెలకొంటోందని రైతులు వాపోతున్నారు.

బెజ్జూర్‌: ఆరుగాలం కష్టపడి పత్తి పండించిన రైతన్నలు దోపిడీకి గురవుతున్నారు. గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు సీసీఐ అధికారులు కొనుగోళ్లలో దగా చేస్తుండటంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉండగా.. నాణ్యత తగ్గిందని, తేమ ఎక్కువుందని కొర్రీలు పెడుతుండటంతో నిండా మునుగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. కాగా, మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చే పత్తిలో 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 తో కొనుగోలు చేస్తామన్న అధికారులు ఇప్పుడు మోసాలకు తెరలేపారు. ఇదివరకు తేమ శాతం సాకుతో ధర తగ్గి నష్టపోయిన రైతులకు.. ఇప్పుడు నాణ్యత ప్రమాణాల పేరిట ధరలో కోత విధించడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సీసీఐ నిర్వాకంతో మోసపోవాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు.

అడుగడుగునా అవస్థలే..

జిల్లా రైతులు పత్తి విక్రయించేందుకు అడుగడుగునా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదివరకు తేమ శాతంతో కొర్రీలు పెట్టగా, ప్రస్తుతం నాణ్యత ప్రమాణాలను సీసీఐ అధికారులు సాకుగా చూపుతూ రైతులను మోసం చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామపంచాయతీలుండగా 10 జిన్నింగ్‌ మిల్లులున్నాయి. ప్రతీ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా దళారులు రైతుల నుంచి పత్తిని అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత మద్దతు ధరతో విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. కాగా, మార్కెట్‌లో తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. పత్తి చేన్లలో నీరు నిల్వ ఉండటం, బీటలు పడటంతో రైతులు మరోసారి విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత సెప్టెంబర్‌, అక్టోబర్‌లో పూత, కాత దశలో ఉండగా వర్షాలు కురవకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడింది. ఎకరాకు ఐదు క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పంటలు పండించగా పెట్టిన పెట్టుబడులూ రాలేని దుస్థితి నెలకొందని దిగులు చెందుతున్నారు.

అడ్డగోలుగా దోచేస్తున్నారు

తేమ పేరిట అడ్డగో లుగా దోచేస్తున్నారు. జిన్నింగ్‌ మిల్లుల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. పత్తికి మద్దతు ధర ఇవ్వకుండా కోత పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలే పంట దిగుబడి తగ్గింది. పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉంది.

– ఉమ్మెర సత్యనారాయణ, మర్థిడి

మద్దతు ధర ఇస్తలేరు

పత్తి పంటకు మద్దతు ధర చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. తేమ, నా ణ్యత ప్రమాణాలను సాకుగా చూపుతూ తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది.

– నికూరి కిరణ్‌, చిన్నసిద్దాపూర్‌

సీసీఐ మాయాజాలం!

పత్తి మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండగా కొద్దిరోజులుగా నాణ్యత తగ్గిందనే సాకు చూపి క్వింటాల్‌కు రూ.50 నుంచి రూ.70 వరకు తగ్గి స్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. అలాగే 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉన్నవా రి వద్దే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు తేల్చి చెబుతుండటంతో రైతులు పత్తిని ఆరబెట్టుకుని మార్కెట్‌కు తెస్తున్నారు. అయినప్పటికీ నాణ్యత లేదనే సాకు చూపి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. తేమ కొర్రీలు, నాణ్య త ప్రమాణాలు ఇలా సవాలక్ష సాకులు చూపుతుండటంతో మద్దతు ధర దక్కడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ చేయలేని స్థితిలో పత్తిని తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.

మార్కెట్‌లో పత్తి ధరలో కోత

నాణ్యత సాకుగా చూపి దగా

సీసీఐ నిర్వాకంతోనే అక్రమాలు

No comments yet. Be the first to comment!
Add a comment
అడ్డగోలు దోపిడీ!1
1/3

అడ్డగోలు దోపిడీ!

అడ్డగోలు దోపిడీ!2
2/3

అడ్డగోలు దోపిడీ!

అడ్డగోలు దోపిడీ!3
3/3

అడ్డగోలు దోపిడీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement