ఆత్మగౌరవ పోరాటమే భీమా కోరేగావ్ యుద్ధం
వాంకిడి: 1818 జనవరి 1న మహారాష్ట్రలోని కోరేగావ్ గ్రామం వద్ద మహర్లు, పీష్వా రాజుల మధ్య జరిగిన విరోచిత యుద్ధం దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార, ఖమాన నాగ్‌సేన్ బుద్ధ విహార ఆవరణలో భీమా కోరేగావ్ శౌర్య దివస్‌ను ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అ మరవీరుల స్తూపాన్ని ప్రదర్శించి నివాళుల
ర్పించారు. అనంతరం పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. పీష్వా రా జ్యంలో మహర్‌లు అంటరానితనంతో దు ర్భర జీవితాన్ని గడుపుతున్న కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో 500 మంది సైనికులు గా చేరి సుమారు 28వేల మంది పీష్వా సై న్యంతో విరోచిత పోరాటం చేసి ఓడించారని తెలిపారు. మహర్‌ల వీరత్వాన్ని గుర్తించిన బ్రిటీష్ అధికారులు కోరేగావ్ గ్రామం వద్ద అమరవీరుల స్తూపం నిర్మించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ మండలాధ్యక్షుడు జైరాం ఉప్రె, నాయకులు విలాస్, రా జేంద్రప్రసాద్, గేడం హిరిషన్, దుర్గం సునీ ల్, హంసరాజ్, శ్యాంరావు, మహేశ్, రోషన్, అరుణ్, రమేశ్, ప్రతాప్, ఖమాన నాయకులు కిషన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment