ఆసిఫాబాద్: జనవరి 1 నుంచి మార్చి 31 వరకు మూడు నెలల పాటు గర్భిణుల రక్తనమూనాలు సేకరించి.. హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, సీ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు డీఎంహెచ్‌వో సీతారాం తెలి పారు. ఇందుకోసం జిల్లాకు రెండు హెచ్‌ఐవీ సెంటినెల్ సర్వైలెన్స్ ప్లస్ కేంద్రాలు మంజూరైనట్లు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంలో 2025 సంవత్సరానికి జిల్లా కేంద్రం, కాగజ్‌నగర్ సీహెచ్‌సీల్లో ఈ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. ఆసిఫాబాద్ పరిధిలో వంద శాంపిళ్ల లక్ష్యానికి ఇప్పటివరకు 11 శాంపిళ్లు సేకరించినట్లు తెలిపారు. అలాగే కాగజ్‌నగర్‌లో 300 శాంపిళ్లకు 13 శాంపిళ్లు సేకరించినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నోడల్ అధికారిగా డాక్టర్ అజ్మత్, కాగజ్‌నగర్ నోడల్ అధికారిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment