కోనేరుసెంటర్: ఈ నెల 26న మచిలీపట్నం పోతేపల్లిలోని ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ ఎ.జితేంద్ర కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో, విజేత గోల్డ్ కవరింగ్స్ వర్క్స్, రవి ఇంజెక్షన్ మౌల్డింగ్ వర్క్స్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. మేళాకు ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ చేసిన అభ్యర్థులు కూడా హాజరుకావచ్చన్నారు. వీరితో పాటు ఫార్మసీ పూర్తిచేసిన 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు రూ.8,000 నుంచి రూ.20,000 వరకు వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు బయోడేటా ఫారమ్‌లతో పాటు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 99664 89796ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment