రోడ్డు ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలే..
డీటీసీ మోహన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాల్లో మూడొంతులు మానవ తప్పిదాల కారణంగా జరుగుతున్నాయని డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకుని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ముద్రించిన పోస్టర్స్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. బెంజిసర్కిల్ సమీపంలోని లారీఓనర్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో డీటీసీ మోహన్ మాట్లాడారు. రహదారి నిబంధనలను పాటించకపోవడంతో గతేడాది రాష్ట్రంలో 8,600 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 413 మంది హెల్మెట్ ధరించకపోవడం తదితర తప్పిదాలతో రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. డ్రైవర్లను చైతన్యపరచడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో లారీ యజమానుల సంఘం డ్రైవింగ్ స్కూలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేంద్రకుమార్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్‌అలీ, లారీ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు నాగుమోతు రాజా, ప్ర ధాన కార్యదర్శి అల్లాడ సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment