గొర్రెల కాపరి దారుణహత్య
ఆత్మకూరురూరల్: మండలంలోని ఇందిరేశ్వరం చెంచు గూడెం సమీపంలో సోమ వారం రాత్రి గొర్రెల కాపరి షేక్ హజ్రత్ వలి(25) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీపతిరావుపేటకు చెందిన షేక్ హజ్రత్‌వలి వరసకు బావ అయిన ఇందిరేశ్వరానికి చెందిన షేక్ షఫితో కలసి గొర్రెల మంద వద్ద పూటుగా మద్యం తాగారు. అనంత రం నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి మెలకువ వచ్చి న షఫి.. గాఢ నిద్రలో ఉన్న తన బావ షేక్ హజ్రత్‌వలిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం హజ్రత్ వలి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. మంగళవారం ఉదయమే ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ రాము ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment