మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్య
మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవటం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కౌన్సెలింగ్‌లో సూచిస్తున్నాం.
– మన్సూరుద్దిన్, ట్రాఫిక్ సీఐ, కర్నూలు
సంవత్సరం కేసులు జరిమానా (రూ.లక్షలు) జైలుశిక్ష (మంది)
2022 316 14.94 246
2023 1156 14.28 983
2024 1124 3.21893
నవంబర్ వరకు
కుటుంబాలకు తలవంపులు....
దొంగలు కాదు... రౌడీలు అంతకన్నా కాదు... పెద్ద నేరాలు చేయలేదు... కానీ మత్తులో వాహనాలు తోలడం వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తోంది. దీనికి కారణం... మద్యం తాగి వాహనం నడపటమే. మత్తులో వారితో పాటు ఎదుటివారి జీవితాలు కూడా నాశనమవుతాయనే ఉద్దేశంతో పోలీసులు మద్యం బాబులపై కొరఢా ఝుళిపిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారు ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తూ పరివర్తన కోసం న్యాయమూర్తులు కూడా కఠినమైన తీర్పులు ఇస్తున్నారు. చాలామంది యువకులు మద్యం తాగి పట్టుబడుతున్నా వారిలో మార్పు కనిపించడం లేదు. ఇలాంటి వారిలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు. వాస్తవానికి మనిషిలో నేర ప్రవృత్తి తొలగి జీవితాల్లో పరివర్తన రావాలనే జైలు శిక్ష విధిస్తారు. కానీ ఎంతైనా జైలు శిక్ష పడితే సమాజంలో చెడ్డ పేరు వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు మూడు రోజులు జైలుకు వెళ్లారంటే వారి కుటుంబాలకు తలవంపే. ఇలా వరుసగా మూడుసార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment