కాల్వలోకి దూసుకెళ్లిన కారు
బనగానపల్లె: ఆరుగురు విద్యార్థినులు మృత్యు కోరల్లో నుంచి త్రుటిలో బయటపడ్డారు. సోమవారం సాయ ంత్రం బనగానపల్లెలో ఎస్సార్‌బీసీ కాల్వలోకి కారు దూసుకెళ్లగా అందులో ఉన్న విద్యార్థినులతో పాటు డ్రైవర్‌ను స్థానికులు, పోలీసులు కాపాడారు. సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన జక్కు సురేష్ కూతురు సాయి చంద్రిక స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మద్యం తాగి ఉన్న సురేష్ సాయంత్రం కుమార్తెను పిల్చుకొచ్చేందుకు టాటా సుమో తీసుకొని స్కూల్‌కు వెళ్లాడు. సాయిచంద్రికతో పాటు అదే కాలనీకి చెందిన మరో ఐదుగురు విద్యార్థినులను వాహనంలో ఎక్కించుకున్నాడు. ఇంటికి ఎస్సార్‌బీసీ కాల్వ కట్ట మీద బయలుదేరాడు. మద్యం మత్తులో వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. అప్పటికి కాల్వలో సుమారు నాలుగున్నర అడుగుల మేర నీరు ఉంది. సుమోకు గల ఓ డోర్ గ్లాస్ ఓపెన్‌లో ఉండటంతో అందులో నుంచి విద్యార్థినులు వాహనంపై భాగానికి చేరుకొని గట్టిగా కేకలు వేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకొని విద్యార్థినులను తాడు సహాయంతో బయటకు తెచ్చారు. సురేష్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందని అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మద్యం మత్తులో డ్రైవింగ్
విద్యార్థినులకు తప్పిన పెను ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment