గడువులోగా వినతులు పరిష్కరించండి
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్ రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై సరైన ఎండార్స్‌మెంట్ ఇచ్చి పరిష్కారాలు చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి,ఎస్‌డీసీ చిరంజీవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీకే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
● రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా ఏమి చేస్తున్నారని కలెక్టర్ పి.రంజితబాషా తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులు పూర్తి కావాస్తున్నా ఒక్క సమస్యకు పరిష్కారం చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో 165, మద్దికెర 81, ఎమ్మిగనూరు 130, పత్తికొండ 80, కౌతాళం 98, ఆలూరు 111, ఆదోని 37, కర్నూలు 125, గోనెగొండ్ల మండలాల్లో 57 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
20 నుంచి ఇంటింటా
కుష్టు వ్యాధిపై సర్వే చేయండి
జిల్లాలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధిపై సర్వే నిర్వహించాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కుష్టు వ్యాధి నివారణపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2027 సంవత్సరంనాటికీ కుష్టువ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా ఇంటింటా సర్వే చేసి కుష్టువ్యాధిగ్రస్తు లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. ఎవరికై నా కుష్టు వ్యాధి లక్షణాలు ఉంటే వైద్యాధికారులకు వివరాలను అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ అధి కారి డాక్టర్ ఎల్.భాస్కర్, వైద్యులు మల్లికార్జునరెడ్డి, విజయ్ ప్రకాష్, వై.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment