● విజేతగా నిలిచిన నంద్యాల వృషభాలు
హోరాహోరీగా..
ఎమ్మిగనూరురూరల్: నీలకంఠేశ్వస్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శనివారం బండులాగుడు పోటీల్లో న్యూ కేటగిరిలో నంద్యాల పట్టణానికి చెందిన బారెడ్డి కేశవరెడ్డి వృషభాలు విజేతగా నిలిచి రూ. 50 వేలు గెలుచుకున్నాయి. శనివారం సాయంత్రం విజేతలకు బహుమతులను తహసీల్దార్ శేషఫణి అందజేశారు. నందవరానికి చెందిన జిముకల మహేష్ వృషభాలు రెండవ బహుమతి రూ. 40 వేలు, డోన్ మండలం మల్యాల షేక్‌మైమున్నా వృషభాలు మూడవ బహుమతి రూ. 30 వేలు, గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు చెవిటి సుంకన్న వృషభాలు నాల్గవ బహుమతి రూ. 20 వేలు, పి.రుద్రవరం ఎల్లాగౌడ్ వృషభాలు ఐదవ బహుమతి రూ. 10 వేలు గెలుచుకున్నట్లు ఆర్గనైజర్లు రాందాస్‌గౌడ్, భాస్కర్, ఉరుకుందయ్యశెట్టి, చంద్రశేఖర్‌రెడ్డి, విరుపాక్షిరెడ్డి, మహేంద్ర, గురురాజదేశాయి, కాశీంవలి, నారాయణరెడ్డి, ఈరన్నగౌడ్ తెలిపారు. ఆదివారం పెద్దసైజు దూలం లాగు పోటీలు ఉంటాయని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment