కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు నాగరాజరావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మా ట్లాడుతూ... ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 42 సంఘాలు ఉన్నాయని, ఇందులో 36 సంఘాలు ఎన్నికల పట్ల ఆసక్తిలో ఉన్నట్లు తెలిపారు. బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్‌ను నెలకొల్పేందుకు ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపినట్లు వివరించారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో 250 మంది సభ్యులు ఉన్నారని, ఈ సంఘానికి త్రిప్ట్ పథకం కింద రూ.8.92 లక్షలు విడుదల అయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment