అనాథలుగా మారిన చిన్నారులు
ప్రభుత్వం, దాతలు.. చిన్నారి బాలికలను ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు
కురవి: పాపం.. పసివాళ్లు. ఎంత కష్టం వచ్చింది. విధి వక్రీంచడంతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన వయసులో ఈ చిన్నారులకు ఎవరూ పూడ్చలేని సమస్య ఎదురైంది. తల్లిదండ్రులిద్దరినీ మాయదారి రోగం కేన్సర్ బలితీసుకుంది. దీంతో ఆ బాలికలు అనాథలుగా మారారు. రెండు సంవత్సరాల క్రితం కేన్సర్‌తో తండ్రి.. ఇప్పుడు తల్లి మృతి చెందగా చిన్నారులు ఒంటరిగా మిగిలారు. ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రా మానికి చెందిన నక్క గుర్వమ్మ, భిక్షం దంపతుల కుమార్తె హేమలత(35)ను కొన్నేళ్ల క్రితం సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన గో ల్కొండ వెంకటరాములుకు ఇచ్చి వివాహం చేశా రు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. ప్రస్తుతం పెద్ద కూతురు నాగమణికి 11 సంవత్సరాలు ఉన్నా యి. ఈ చిన్నారి 5వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు సుమలత 10 సంవత్సరాలు ఉండి నా లుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలో రెండేళ్ల క్రితం వెంకటరాములు కేన్సర్ మహమ్మారితో మృతి చెందాడు.
దీంతో హేమలత తన ఇద్దరు కూతుళ్లు నాగమణి, సుమలతలను తీసుకుని తల్లి గారి ఊరు బలపాలకు వచ్చి జీవిస్తోంది. తల్లి గుర్వమ్మ అండతో హేమలత పిల్లలను చదివిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హేమలత సైతం కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారు. దీనిపై ప్రభుత్వం, దాతలు స్పందించి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకోవాలని గ్రామమస్తు కోరుతున్నారు. కాగా, చిన్న కుమార్తె సుమలత తల్లికి తలకొరివి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment