● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య
న్యూశాయంపేట: బీజేపీ మతోన్మాద విధానాల్ని వ్యతిరేకించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని పార్టీ ఆఫీస్‌లో జిల్లా కమిటీ సభ్యుడు చక్రపాణి అధ్యక్షతన విస్తృత సమావేశం నిర్వహించారు. నాగయ్య మాట్లాడుతూ.. మతోన్మాద భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించడం వీలు కావడం లేదనే కుట్రతో అప్పుడప్పుడు బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కొక్కరు నిందలు వేసుకోవడం తప్ప ప్రజా సమస్యలపై చర్చలు లేవన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వాసుదేవరెడ్డి, చుక్కయ్య, వెంకట్, వీరన్న, రాములు తిరుపతి, దీప్ లింగయ్య, భానునాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment