క్రీడాభివృద్ధిపై హెచ్‌సీఏకు శ్రద్ధ లేదు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నిధులపై ఉన్న శ్రద్ధ క్రీడాభివృద్ధిపై లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని టీసీఏ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 8 నుంచి 18వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో తెలంగాణ గోల్డ్ ప్రీమియర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో పాల్గొనే జట్టు ప్రవేశ రుసుం రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విజేతకు రూ.50వేలు, రన్నరప్‌కు రూ.25వేల నగదు పారితోషికం అందజేస్తామన్నా రు. టీసీఏ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్ మాట్లాడుతూ పది రోజులు జరిగే మ్యాచ్‌లు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానం, వరంగల్ శివారు మొగిలిచర్లలో జరుగుతాయని తెలిపా రు. ఇందులో నుంచి ఉత్తమ జట్లను ఎంపిక చేసి జనవరి 26 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. హెచ్‌సీఏ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాగా టీసీఏ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తోందన్నారు. జట్ల రిజిస్ట్రేషన్ కోసం 9581124444, 9700664444 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. టీజీఏ జాయింట్ సెక్రటరీ మహ్మద్ అలీం, ఎం. సమీఅక్మల్ పాల్గొన్నారు.
‘టి’ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి విజయ్‌చందర్‌రెడ్డి
8 నుంచి గోల్డ్ ప్రీమియర్ కప్ క్రికెట్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment