అధికారుల్లో ఆందోళన
జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఎప్పుడు ఏ ఉప ద్రవం ముంచుకొస్తుందో అని జిల్లాలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు ప్రచారం. ప్రధానంగా బియ్యం, బెల్లం, ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో పనిచేసే వారిపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా సివిల్ వ్యవహారాల్లో తలదూర్చడం, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించకుండా పెద్ద మనుషుల పంచాయితీలను ప్రొత్సహించడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు ప్రచారం. అయితే తెలంగాణ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాల సేకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ... స్కానర్లు ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో అందుబాటులో ఉంచారు. వీటిని వినియోగించి ఎవరు ఎవరిపై ఫిర్యాదు చేస్తారో.. అవి ఎటు దారి తీస్తాయో అనే భయం కూడా పట్టుకుందని ప్రచారం.
Comments
Please login to add a commentAdd a comment