No Headline
● సైనికులకు జన్మనిచ్చిన ‘కంబాలపల్లి’
● సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్న వెంగంపేట రైతులు
● రాజ్యాంగ ఫలాలు వినియోగించుకుంటూ ముందుకు
నేడు గణతంత్ర దినోత్సవం
●
మహబూబాబాద్ రూరల్: భారతావని సేవలో యువత తరిస్తుండగా సైనికులకు జన్మనిచ్చిన గ్రా మంగా కంబాలపల్లి పేరెన్నికగంటుంది. దేశానికి సేవ చేస్తున్న రక్షణ, ఇతర విభాగ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వీరజవాన్లను తయారు చేసింది మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం. సీఐఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్‌ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్‌ఎస్పీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఏఆర్, పోలీస్ విభాగాల్లో ఈ గ్రామం నుంచి 51 మంది వరకు సేవలు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఉద్యోగంలో చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామానికి చెందిన యువకులు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి రమేశ్ ఆర్మీలో 16 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి పదవీ విరమణ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ పరీక్ష రాసి ప్రస్తుతం గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నారు. దేశ సేవ చేసేందుకు వెళ్లిన వారితో కంబాలపల్లి గ్రామ కీర్తిప్రతిష్టలు పెరుగుతున్నాయి.
భారతావని సేవలో యువత
జిల్లాలోని కొన్ని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశానికి సేవ చేస్తున్న రక్షణ, ఇతర విభాగ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వీరజవాన్లను తయారు చేసింది మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం. గూడూరు మండలం వెంగంపేటకు చెందిన కట్ల వెంకట్‌రెడ్డి 20 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరిపెడ మండలం ఎల్లంపేటలో మహి ళా సంఘం సభ్యులు విద్యార్థులు యూనిఫామ్ కుడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
Comments
Please login to add a commentAdd a comment