ఆదివారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
● ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు గూడూరు మండలం వెంగంపేటకు చెందిన కట్ల వెంకట్‌రెడ్డి. గత 20 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నాటి మూసధోరణి వ్యవసాయానికి స్వస్తి పలుకుతూ నేటి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని అధిక దిగుబడి సాధిస్తున్నాడు. తనకున్న 4 ఎకరాల్లో 2 ఎకరాల్లో బీర, 2 ఎకరాల్లో కాకరను పందిరి పద్ధతిలో సాగు చేసి అధిక దిగుబడి సాధించారు. ఈ పద్ధతితో అధిక లాభాలు వస్తుండటంతో సమీప రైతుల భూములను కౌలుకు తీసుకుని, మెళకువలు పాటిస్తూ కూరగాయలను పండిస్తున్నట్లు తెలిపారు. పందిరి సాగు పద్ధతిలో ప్రతీ సంవత్సరం బీర, కాకర, టమాట, సోర తదితర కూరగాయల పంటలు సాగు చేస్తూ సంవత్సరానికి ఖర్చులు పోను రూ.14లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. వెంకట్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో మరో 50 మంది రైతులు కూడా కూరగాయల సాగు చేస్తుండటం విశేషం. ఇలా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తూ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా వెంగంపేట రైతులు పేరుగాంచారు. – గూడూరు
● మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో ఐకేపీ సహకారంతో వీ రభద్ర మహి ళా సంఘం సభ్యులు స్త్రీ శక్తి స్ట్రిచ్చింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మహిళా సంఘం సభ్యులు దుస్తులు కుట్టేలా అన్ని రకాల మెళకువలు నేర్పించారు. ప్రస్తుతం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్‌లు కుడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని సమానంగా పంచుకుంటున్నారు. స్వయం ఉపాధి పొందుతుండటంతో పలు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – మరిపెడ రూరల్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment