రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ లో జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభకనబరిచి విజేతగా నిలవాలని డీవైఎస్‌ఓ ఎస్.శ్రీనివాస్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లా జూనియర్ బాలికల కబడ్డీ జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతర సాధనతోనే క్రీడల్లో విజయం సాధించవచ్చని అన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో సత్తా చాటాలని సూచించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో ఆదివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ తెలిపారు. జిల్లా జట్టుకు గంగ, మౌనిక, అనూష, పార్వతి, గాయత్రి, నందిని, ఇందుబాయి, సింధూజ, సంధ్యారాణి, శిరీష, రాణి, సోను ఎంపికై నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కోశాధికారి ఉమామహేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులు బాల్‌రాజు, పాపారాయుడు, పీడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment