రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో శ్రమదానం చేశారు. అలాగే అక్కడి బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో విద్యావ్యవస్థను విస్మరించారని ఆరోపించారు. విద్యార్థులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయులను నియమించామని, హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు పెంచి వారికి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్‌అహ్మద్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కౌన్సిలర్లు నర్సింహులు, ఉమర్‌పాషా, మున్సిపల్ కమిషన ర్ మహేశ్వర్‌రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌బాబు, వార్డెన్ గోవర్ధన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment