నేటి నుంచి సీఎం కప్ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం నుంచి జనవరి 2వరకు సీఎం కప్ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించగా, మరో రాష్ట్రస్థాయి పోటీలకు మెయిన్ స్టేడియం వేదికై ంది.
630 మంది క్రీడాకారుల రాక
రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 630 మంది, మహిళలు, అఫీషియల్స్ 250 మంది(కోచ్, మేనేజర్లు, అంపైర్స్) రానున్నారు. మెయిన్ స్టేడియంలో నాలుగు కోర్టుల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుష క్రీడాకారులకు ఎంవీఎస్ ఇండోర్ స్టేడియం, అంబేద్కర్ కళాభవన్, మెయిన్ స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్‌లోని పై అంతస్తు, మహిళలకు ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాల, బీపీహెచ్‌ఎస్, మాడ్రన్ స్కూల్‌లో మహిళలకు వసతి, మెయిన్ స్టేడియంలో క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. నేటి ఉదయం నెట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
జిల్లాల జట్లను 8 పూల్‌లుగా విభజన,,
26 జిల్లాల జట్లను 8 పూల్‌లుగా విభజించారు.
మహిళల విభాగం..
పూల్–ఏలో మహబూబ్‌నగర్, జనగాం, జగిత్యాల, మంచిర్చాల, బీలో ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సీలో భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కామారెడ్డి, డీలో హైదరాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కజ్‌గిరి, ఈలో నిర్మల్, జోగుళాంబ గద్వాల, కొమురంభీం ఆసిఫాబాద్, ఎఫ్‌లో రంగారెడ్డి, మహబూబాబాద్, మెదక్, జీలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, హెచ్‌లో కరీంనగర్, హన్మకొండ, వనపర్తి ఉన్నాయి.
పురుషుల విభాగం..
పూల్–ఏలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, జగిత్యాల, హన్మకొండ, బీలో నారాయణపేట, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సీలో మహబూబాబాద్, వనపర్తి, నల్గొండ, డీలో హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, ఈలో ఖమ్మం, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఎఫ్‌లో కామారెడ్డి, మేడ్చల్, మెదక్, జీలో కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం, నిజామాబాద్, హెచ్‌లో వరంగల్, నాగర్‌కర్నూల్, నిర్మల్ ఉన్నాయి.
మూడు రోజుల పాటు పురుషుల, మహిళల చాంపియన్‌షిప్
26 జిల్లాల నుంచి 630 మంది క్రీడాకారులు, 250 మంది అఫీషియల్స్ రాక
నాలుగు కోర్టుల్లో మ్యాచ్‌ల నిర్వహణ
క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ టోర్నీని అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించాం. ఈ టోర్నీని కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.
– ఎస్.శ్రీనివాస్, జిల్లా యువజన, క్రీడల అధికారి, మహబూబ్‌నగర్
టోర్నీ విజయవంతానికి
సహకారం అందిస్తాం
జిల్లాకు రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. టోర్నీ విజయవంతం కోసం నెట్‌బాల్ సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తాం.
– ఖాజాఖాన్, కార్యదర్శి,
నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment