వినతిపత్రం ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను పార్టీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు సోమవారం ఆదిలాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కొత్తగా భూగర్భ గనులను బెల్లంపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, రిక్రూట్‌మెంట్ విధానాన్ని మార్చాలని, పరుగు పందెం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీరు అందించాలని, వ్యవసాయ అనుబంధ రంగాలను ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లయ్య, నాయకులు బత్తుల రవి, భీమయ్య, రాము, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment