పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిసాయి. మంగళవారం రాత్రి అవాంఛనీయ సంఘటనలు చో టు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టా రు. రామగుండం పోలీస్ కమిషన్‌ర్ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ అర్ధరాత్రి వరకు పెట్రోలింగ్ నిర్వహించారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారిపై కొరడా ఝలిపించారు. వాహనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొందరు యువకులు మద్యం సేవించి బెల్లంపల్లి చౌరస్తాలో పోలీసులతో వాగ్వాదాని కి దిగారు. ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ వారి తో మాట్లాడి ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి పంపించారు. రాత్రి 10గంటల నుంచి వేకువజా మున ఉదయం 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి. జిల్లాలో 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యయి. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావ్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరేష్‌కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment