ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్థానిక బాలుర ఉన్నత పాఠశా ల మైదానంలో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా(జోనల్) క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు అట్టహా సంగా జరిగాయి. ఆదిలాబాద్ జట్టుకు సిద్ధార్థ, పూ ర్ణేష్, సమీ, వికాస్(మిమ్స్ డిగ్రీ, మంచిర్యాల), వంశీ, హరీష్, హర్షవర్థన్, కృష్ణ, వినయ్, సుధీర్(వా గ్థేవి డిగ్రీ కళశాల), సాయికృష్ణ, హుజేర్, రోహిత్, సాయిచరణ్ ఎంపికయ్యారు. కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మంలో ఈ నెల 3, 4, 5న నిర్వహించే ఇంటర్ కళాశాలల అంతర్ జిల్లా టోర్నమెంట్ పోటీల్లో పాల్గొంటారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను పర్యవేక్షకులు పీడీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, డైరెక్టర్ శ్రీనివాస్ అభినందిచారు.
Comments
Please login to add a commentAdd a comment