రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
● రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్
జన్నారం: ప్రస్తుత పరిస్థితుల్లో హక్కుల కోసం రా జ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ అన్నారు. భీమా కోరేగావ్ యుద్ధాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆ పోరాటంలో వీరమరణం పొందిన మహర్ సైనికులను స్మరిస్తూ జన్నారంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, మానభంగా లు, లైంగిక వేధింపులు దేశంలో నేటికీ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ, ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొర్లకుంట ప్రభుదాస్, జన్నారం మండల అధ్యక్షుడు సిటిమల్ల భరత్‌కుమార్, సంఘం జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్, తాజామా జీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, నేతకాని, మహర్ కుల సంఘం రాష్ట్ర జేఏసీ నాయకులు తాళ్లపెల్లి రా జేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment