విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
● ప్రజలకు అందుబాటులోకి ఆసుపత్రులు ● 100శాతం ఉత్తీర్ణతకు ప్రత్యేక కార్యాచరణ ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘‘కొత్త సంవత్సరంలో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధు ల సమన్వయంతో ముందుకు వెళ్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హుల కు చేరేలా చూస్తా. ప్రధానంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తా..’’ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభు త్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా, మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని తెలిపారు.
జిల్లా అభివృద్ధి లక్ష్యాలు, ఎలా ముందుకు వెళ్తారు..
కలెక్టర్: ప్రభుత్వ పథకాలతోపాటు జిల్లాలో విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తా. ఇప్పటికే మంజూరైన క్రిటికల్ కేర్, మాతాశిశు, సూపర్‌స్పెషాలిటీ, క్యాన్సర్ ఆస్పత్రి, మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టి ఈ ఏడాదిలో ప్రజల సౌకర్యార్థం తీసుకు వస్తాను.
విద్యలో ఉత్తీర్ణతలో జిల్లా వెనుకబడుతోంది..
కలెక్టర్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత 100శాతం సాధించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కొత్త సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు చర్యలు చేపడుతాం. ఇప్పటికే జిల్లాకు మంజూరైన దండేపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్, నవోదయ పాఠశాల, ఇంటర్మీ డియెట్ కళాశాలలు, సాయికుంటలో ఇండోర్‌స్టేడియం తదితర నిర్మాణాలు వేగవంతంగా చేపట్టి విద్యార్థులు, క్రీడాకారులకు అందుబాటులో తెస్తా.
గ్రీవెన్స్‌లో సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరు పదే పదే వస్తున్నారు..
కలెక్టర్: ప్రజావాణిలో వచ్చే సమస్యలు ఎక్కువగా భూములవే, కోర్టు వివాదాలతో ఉంటున్నాయి. ఒకే భూమిపై ముగ్గురు, నలుగురు ఫిర్యాదు చేస్తున్నా రు. కోర్టు విచారణలో ఉంటున్నాయి. వాటిని పరిష్కరించే అవకాశం ఉండదు. ధరణిలో వచ్చిన దరఖాస్తులు విచారణ చేపట్టి రోజుకు 40 నుంచి 50 పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త భూ చట్టంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుటున్నాం.
జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణదారులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టర్: ఫిర్యాదులు వచ్చిన వాటిపై విచారణ చేపడుతున్నాం. కొన్నింటికి ఇంటి నంబర్లు, కోర్టు స్టే ఆర్డర్ ఉంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేసులు నమోదు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment