టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో వేడుకలు
మంచిర్యాలటౌన్: టీఎన్జీవోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వే డుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీవో జి.శ్రీనివాస్‌రావు, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహ రి ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్‌కు వివరించారు. కలెక్టరేట్ ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆర్టీసీ బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ ఉండాలని కోరా రు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బా పురావు, కోశాధికారి అనుముల సతీశ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కేజియా రాణి, తిరుపతి, సంయుక్త కార్యదర్శులు సునిత, యూనస్, నాగుల గోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment