కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి విజయచిహ్నం చూపిస్తున్న వివేక్
చెన్నూర్: చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం హస్తగతమైంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామికి 87,541 ఓట్లు రాగా, సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు 50,026 ఓట్లు వచ్చాయి.
వివేక్ వెంకటస్వామి సుమన్‌పై 37,541 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ అధిక్యత ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ మొదటి రౌండ్ నుంచే రెండో స్థానానికి పరిమితమయ్యారు. బీజేపీ అభ్యర్థి 3,375 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇతరులకు 9,496, నోటాకు 1,792 ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment