విదేశాల్లో ఉద్యోగావకాశాలు
పాతమంచిర్యాల: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద ఆరోగ్య, ఆరోగ్యేతర రంగాలలో విదేశాల్లో పనిచేసేందుకు అర్హత గల వారికి శిక్షణ, ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు 9440051452, 9951 909863 నంబర్లలో సంప్రదించాలన్నారు.
7 నుంచి డీఎడ్ వెబ్ ఆప్షన్లు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో డీఎడ్‌లో ర్యాంక్‌లు సాధించిన అభ్యర్థులు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ను ఎంచుకోవాలని డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు, 13న సీట్ల కేటాయింపు, 13 నుంచి 15 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయడం, 18 న స్లైడింగ్, 21 వరకు కళాశాలల్లో రిపోర్టు చే యాలని పేర్కొన్నారు. ఇదివరకు సర్టిఫికెట్లను పరిశీలించని అభ్యర్థులు 5న సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.
దూడను హతమార్చిన పులి?
ఇంద్రవెల్లి: మండలంలోని గట్టెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రైతుకు చెందిన దూడపై పులి దాడిచేసి హతమార్చినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మెస్రం బాదిరావ్‌కు చెందిన దూడ ఐదు రోజుల క్రితం అటవీప్రాంతానికి మేతకు వెళ్లి తిరిగిరాలేదు. మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో గాలించగా ఆలికోరి అటవి ప్రాంతంలో దూడ కళేబరం గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకుని దూడ కళేబరాన్ని, పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. పులి సంచరించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని ఎఫ్‌ఆర్‌వో సంతోష్ తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 2, 3 తేదీల్లో హన్మకొండలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల బాక్సింగ్ పోటీల్లో 3 పతకాలతో మెరిశారు. 46–48 కేజీల విభాగంలో టీ.నిహారిక స్వర్ణ పతకం, 40–42 కేజీల విభాగంలో వివేకవర్ధిని రజత పతకం, 40–44 కేజీల విభాగంలో అనూష కాంస్య పతకం సాధించినట్లు బాక్సింగ్ కోచ్ సాయి తెలిపారు. నిహారిక ఈ నెల 7నుంచి 12 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో 42మంది డీబార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల్లో మంగళవారం నిర్వహించిన మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో వివిధ కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ 42 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. వరంగల్ జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్‌లో 35 మంది, ఖమ్మం జిల్లాలో ఆరుగురు డీబార్ అయినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచా రి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment