మెరుగైన విద్య, వైద్యం అందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల డీటీడీవో, ఏటీడీవోలను ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన పోషణ మిత్ర ద్వారా విద్యార్థులకు రక్తహీనత లేకుండా చూడాలన్నారు. అలగే మోవా లడ్డూ సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. స్నానానికి వేడినీళ్లు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఏటీడీవోలకు సూచించారు. ఆశ్రమ పాఠశాలలను సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించాలన్నారు. సమావేశంలో ఏటీఎంహెచ్‌వో మనోహర్, డీటీడీవో రమాదేవి, ఉమ్మడి జిల్లాల ఏటీడీవోలు, జీసీడీవోలు, ఏసీఎంవోలు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించి సబెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. అనంతరం ఉట్నూర్ మండలంలోని సుక్యతాండ, లంబాడీతండాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment