విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రభుత్వ పాఠశాలల తనిఖీ
చెన్నూర్: విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్ర త్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం చెన్నూర్ మున్సిపాలిటీ పరి ధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలను సందర్శించారు. రిజిష్టర్లు పరిశీలించారు. 4, 5, 15వ వార్డుల్లో అభివృద్ధి పనులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమృత్ 2.0 వాటర్ ట్యాంక్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పాఠాలు చె ప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గుణాత్మక విద్యను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు విధులపై అంకితభావంతో ఉండాలని, విద్యార్థుల కు అర్థమయ్యే రీతిలో బోధించాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని తెలిపా రు. ఓఆర్ ప్లాంట్ మరమ్మతుకు అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ జాబితాను భోజనశాలలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ధరణి పోర్టల్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు గడువులోగా అందజేయాలని సూచించారు. తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఆర్‌ఐ వెంకటేశ్ పాల్గొన్నారు.
సీపీవోగా సత్యం బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా ప్రణాళిక అధికారి(సీపీవో)గా జి.సత్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 7న సీపీవోగా జిల్లాకు వచ్చిన మహ్మద్ ఖాసీం బుధవారం పదోన్నతిపై మైనార్టీ కమిషనరేట్ జేడీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జిల్లా గణాంక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యంకు ఇంచార్జి సీపీవోగా రాష్ట్ర ప్రణాళిక కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ చేయడంతో బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment