మంచిర్యాలలో వందేభారత్ రైలు నిలపాలి
మంచిర్యాలటౌన్: సికింద్రాబాద్–నాగ్‌పూర్ వందేభారత్ రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కోరా రు. బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆదాయపరంగా మంచిర్యాల రైల్వేస్టేషన్ నాన్ సబర్బన్ గ్రేడ్ రైల్వేస్టేషన్(ఎన్‌ఎస్‌జీ4) జాబి తాలో 30వ స్థానంలో ఉందని, అత్యధిక ఆదా యం ఉన్నా వందేభారత్ రైలు నిలుపుదల చేయడం లేదని తెలిపారు. రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ మధ్య దూరం ఉన్న తక్కువ ఉందని మంచిర్యాలకు హాల్టింగ్ ఇవ్వలేదని, కానీ చంద్రపూర్, బల్లార్షల మధ్య దూ రం తక్కువ ఉన్నా రెండు స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉందని పేర్కొన్నారు. మంచి ర్యాల నుంచి నిత్యం అనేక మంది వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్, నాగ్‌పూర్ వెళ్తుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, రవీందర్‌రావు, బెల్లంకొండ మురళీధర్, జయరామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment