స్మగ్లింగ్ నిరోధానికి ఫారెస్ట్ మార్చ్
● నూతన ప్రయోగానికి శ్రీకారం ● ఇందన్‌పల్లి రేంజ్‌లో అమలు
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్‌లో విలువైన టేకు కలపను స్మగ్లర్లు తరలిస్తుండడం అటవీశాఖకు తలనొ ప్పిగా మారింది. కలప స్మగ్లింగ్ నిరోధించడానికి అ ధికారులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా వారి కళ్లుగప్పి తరలిస్తున్నారు. ఈక్రమంలో జ న్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి అటవీరేంజ్‌లో ఫారెస్ట్ అధికారి కారం శ్రీనివాస్ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొదటిసారిగా రేంజ్ పరిధిలో సిబ్బందితో కలిసి ఫారెస్ట్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిబ్బంది మూకుమ్మడిగా అడవిలో స్మగ్లింగ్ నిరోధానికి ముందస్తు తనిఖీ చేస్తారు. అటవీ ప్రాంతంలోని బీట్‌ను ఎంచుకుని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని కంపార్టుమెంట్లలో తనిఖీ చేస్తారు. చెట్లు నరికివేతకు గురైతే వివరాలు సేకరిస్తారు. కారణం కనుక్కుని ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. పడిపోయిన కలప ఉంటే టింబర్ డిపోకు తరలిస్తారు. ప్రతీవారం అడవిలో పరేడ్, బీట్లవారీగా ఫారెస్ట్ మార్చ్ నిర్వహిస్తారు. సి బ్బంది కొందరు విధుల్లో నిర్లక్ష్యం కారణంగా కలప తరలిపోతుందనే ఆరోపణల దృష్ట్యా ఫారెస్ట్ మార్చ్ ప్రారంభించారు. ఏ బీట్ పరిధిలో నిర్వహిస్తారనేది గోప్యంగా ఉంచుతారు. ఫారెస్ట్ మార్చ్ వల్ల సిబ్బందికి బీట్‌లోని కంపార్టుమెంట్ల వారీగా అడవిపై అవగాహన కలుగుతుందని, వన్యప్రాణులను రక్షిస్తూనే అభివృద్ధి పనులతోపాటు స్మగ్లింగ్ నిరోధానికి పెద్దపీట వేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామని ఫారెస్ట్ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment