జన్నారం: అడవిలో నివసించే వన్యప్రాణుల ద్వారా జరిగే నష్టానికి సంబంధించి అటవీ శా ఖ అందజేసే పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం, పీసీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జ న్నారం రేంజ్ అధికారి సుష్మారావు ఒక ప్రకట నలో తెలిపారు. గతంలో వన్యప్రాణుల(పులి, చిరుత, ఎలుగుబంటి) దాడిలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వగా, దానిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపా రు. గాయపడిన వారికి రూ.లక్ష వరకు పెంచడమే కాకుండా రూ. 10 వేలు వెంటనే అందజేస్తారని పేర్కొన్నారు. వన్యమృగాలు పశువులను చంపితే మార్కెట్ ధర ప్రకారం రూ.50 వేల వరకు పరి హారం పెంచినట్లు తెలిపారు. పశువైద్యాధికా రి, సెక్షన్ అధికారి సంయుక్త పంచనామా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వన్యప్రాణుల ద్వారా పంట నష్టపోతే గతంలో ఎకరాకు రూ.6 వేలు ఇచ్చేవారని, ప్రస్తుతం రూ.7వేలకు పెంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment